యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ కథానాయకుడిగా..దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న అద్భుత సైన్స్ ఫిక్షన్ సినిమా కల్కి 2898 ఏడీ . ఈ సినిమా కోసం అటు ప్రభాస్ అభిమానులతో పాటు..ఇటు సినీ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమాని జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేందుకు చిత్ర బృందం రెడీ అవుతుంది.
ఈ మూవీ విదేశాలతో పాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేసుకుంది. కల్కి షూటింగ్‌కి సంబంధించి తాజాగా ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కల్కి 2898 ఏడీ సినిమాలో నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సీన్స్ ఉంటాయట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. జూన్ 27 వరకు ఆగాల్సిందే.
2020లో పెరుమాళ్లపాడు స్థానిక యువత ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని స్థానికులు కోరారు. 200 ఏళ్ల క్రితం ఇసుక తుఫాన్ల కారణంగా ఈ ఆలయం ఇసుక కింద కూరుకుపోయింది.