చంద్రన్నకే కిరీటం : 15 దాటని దారుణ ఓటమికి దగ్గరగా జగన్!
ప్రభుత్వంపై వ్యతిరేకతకు విపక్షాల ఐక్యత తోడు
రాయలసీమలోనూ ముఖం చాటేస్తున్న ప్రజలు
రాజధాని మాయను అసహ్యించుకున్న ఉత్తరాంధ్ర
పతనంలో గోదావరోళ్ల ప్రత్యేకపాత్ర
అమరావతి ద్రోహానికి ఆంధ్ర అందిస్తున్న చెంపపెట్టు
(తెలుగు మోపో ప్రత్యేక ప్రతినిధి)
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత అయిదేళ్ల పాలనకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రదర్శించిన టక్కుటమార గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలేమీ అంతగా ఫలించిన పరిస్థితి కనిపించడం లేదు. సంక్షేమం ముసుగులో జగన్ సాగించిన విధ్వంసక పాలనకు రాష్ట్ర ప్రజ తీర్పు చెప్పడానికి సిద్ధం అవుతున్న తరుణంలో, రాష్ట్ర వ్యాప్త పరిస్థితులను మదింపు వేసినప్పుడు.. విస్తుగొలిపే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. మరో మూడు దశాబ్దాల పాటూ తానే ముఖ్యమంత్రిగా వెలుగొందాలని జగన్ అనుకుంటే.. ‘ఒక్క చాన్స్’ ఇచ్చినందుకే తమను తాము నిందించుకుంటున్న ప్రజలు, ఈ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపడానికి సిద్ధమవుతున్నారు. 151 సీట్లు దక్కాయని విర్రవీగుతూ బోరవిరుచుకుని తిరిగిన పార్టీ ఇప్పుడు దారుణమైన పరాభవం అంచున కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానికులతో సంప్రదిస్తూ తెలుగుమోపో డాట్ కామ్ ప్రస్తుత ఎన్నికల వాతావరణాన్ని అధ్యయనం చేసినప్పుడు.. అధికార పార్టీ ఇరవై సీట్లు దాటడం కూడా కష్టమే అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.
విస్మయపరిచే వాస్తవాలు ఏంటంటే.. 2019 ఎన్నికల్లో ఏయే జిల్లాలు అయితే జగన్మోహన్ రెడ్డిని ఏకపక్షంగా నెత్తినపెట్టుకున్నాయో.. ఆయా జిల్లాల్లో ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కంటున్నారు. అలాగే.. ఎవరు ఎంత కష్టపడినా సరే.. రాయలసీమ జిల్లాల్లో తనకు తిరుగుఉండదు అనుకున్న జగన్ కు షాక్ ఎదురు కానుంది. ఎగ్జిక్యూటివ్ రాజధాని పేరుతో విశాఖ మరియు ఉత్తరాంధ్ర ప్రజలను మాయ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆ ముసుగులో జరిగిన భూదందాల అరాచకత్వాన్ని వారంతా గుర్తించారు. గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీకి ఉపయోగపడిన ఉభయగోదావరి జిల్లాలు ఈ దఫా.. వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టేయబోతున్నాయి. గుంటూరు- ఆంధ్ర ప్రాంతపు సంగతి సరేసరి! అమరావతి రాజధానిపై విషం కక్కిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద.. ఇప్పుడు తమకు సమయం వచ్చింది గనుక నిప్పులు కక్కడానికి ఆ ప్రాంత ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఏ రకంగా చూసినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో బయటపడే మార్గాలు కనిపించడం లేదు.
ప్రత్యేకించి రాజధాని ముసుగులో ఉత్తరాంధ్ర వాసులకు జగన్ ఇన్నాళ్లూ తన అరచేతిలో చూపించిన స్వర్గం ఆయనకు ఉపయోగపడలేదు. శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఒకటి రెండు సీట్లు మినహా అన్నింటినీ కూటమి గెలవనుంది. మాజీ మంత్రులు ధర్మాన సోదరులు ఇద్దరికీ భంగపాటు తప్పడం లేదు. కమలదళం పోటీచేస్తున్న ఒక నియోజకవర్గంలో తప్ప కూటమి మొత్తంగా విజయబావుటా ఎగరేయబోతోంది.
విజయనగరం ఎంపీ నియోజకవర్గం పరిధిలో చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు విజయావకాశాలు ఉన్నాయి. తతిమ్మా అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీకి తల బొప్పికట్టనుంది.
విశాఖపట్టణం నగర పరిధిలోని మొత్తం నాలుగు నియోజకవర్గాలను గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలుచుకుంది. అయితే ఈ దఫా ఒక్కటి చేజారే అవకాశం ఉంది. రాజధాని మంత్రం ఇక్కడ ఏమాత్రం పనిచేయడం లేదు. ప్రత్యర్థుల మీద నానా చెత్త మాటలతో విరుచుకుపడే మంత్రి గుడివాడ అమర్ నాధ్ సహా వైసీపీ మోహరించిన వారంతా ఓటమికి దగ్గరగా ఉన్నారు.
అనకాపల్లి పరిధిలో యలమంచిలి, పాయకరావుపేటలలో పోటీ కాస్త క్లిష్టంగా ఉంది మినహా.. తతిమ్మా నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. కొణతల రామక్రిష్ణ, చింతకాయల అయ్యన్న పాత్రుడు తదితరులు గెలుపుబాటలో ఉండడం గమనార్హం.
మన్య పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని రిజర్వుడు నియోజకవర్గాలో అధికార పార్టీకి ఒకింత ఊరట దక్కుతుంది. కూటమితో సమానంగా వారు కూడా అక్కడ సీట్లు దక్కించుకునే పరిస్థతి ఉంది.
కాకినాడ ఎంపీ నియోజకవర్గం పరిధిలో మొత్తం అన్ని సీట్లలోనూ కూటమిదే గెలుపుబావుటా. తునిలో పోటీ క్లిష్టంగా ఉన్నప్పటికీ.. యనమల రామక్రిష్ణుడు కుమార్తె గెలిచే చాన్సుంది. మిగిలిన ఆరు అసెంబ్లీసీట్లు ఏకపక్షంగా కూటమి ఖాతాలో పడనున్నాయి. మాజీ మంత్రులు కన్నబాబు సహా అందరూ ఓటమి దిశగా వెళుతున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీచేస్తుండడం అనేది.. ఈ నియోజకవర్గం పరిధిలో మాత్రమే కాకుండా.. ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగా తెలుగుదేశం కూటమికి పెద్ద ఎడ్వాంటేజీగా మారింది. అలాగే కోనసీమ జిల్లాలో ఒక్క రామచంద్రపురం తప్ప అన్ని నియోజకవర్గాలో కూటమికే జై కొడుతున్నాయి. ఏలూరు నియోజకవర్గం పరిధిలో పోలవరం, నూజివీడు ల్లో పోటీ హోరాహోరీగా ఉన్నది గానీ.. కూటమి అబ్యర్థులేన బయటపడుతారని స్థానికులు అంటున్నారు.
విజయవాడ ఎంపీ నియోజకవర్గం పరిధిలో తిరువూరు మినహా అన్ని చోట్ల ఎన్డీయే కూటమి గెలవబోతోంది. విజయవాడ నగరం, అమరావతి ప్రాంతం కూటమికి హారతి పడుతోంది. బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని సహా వైసీపీ మాజీ మంత్రులందరూ ఇంటిదారి పడుతున్నారు. అమరావతి రాజధాని స్వప్నాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పట్ల ఆ ప్రాంతంలో ప్రజలు నిప్పులు కక్కడంలో వింతేం లేదు. కాకపోతే పామర్రు నియోజకవర్గంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే కాస్త గట్టిపోటీ ఇస్తున్నారు. గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యే సీట్లలో కూడా జగన్ అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తున్నారు. తతిమ్మా తాడికొండ, మంగళగిరి, తెనాలి, ప్రత్తిపాడు, పొన్నూరు అన్నిచోట్లా కూటమి అభ్యర్థులు గెలవనున్నారు. నారాలోకేష్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికకాబోతున్న సందర్భం ఇది. బాపట్ల జిల్లా పరిధిలో బాపట్ల ఎమ్మెల్యే స్థానం మినహా అన్నీ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. పల్నాడు జిల్లాలో కూడా జగన్ స్వయంకృత అపరాధాలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నాయి. ఒక్క నరసరావుపేటలో తప్ప మరెక్కడా కూడా జగన్ అభ్యర్థులు గట్టిపోటీ ఇవ్వలేకపోతున్నారు. ప్రకాశం జిల్లా పరిధిలో యర్రగొండ పాలెంలో జగన్ పరిస్థితి పరవాలేదు. ఇక్కడ మాగుంట ఎమ్మెల్యేల ఎన్నికలను కూడా తన సొంత ప్రతిష్టతోముడిపెట్టి తీసుకోవడంతో.. అన్నిచోట్ల జగన్ కు భంగపాటు ఎదురవుతుందనే అంచనాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు జిల్లాలో ఈసారి జగన్ కు గడ్డు రోజులే. కావలి, సర్వేపల్లి మినహా మరెక్కడా ఆయనకు శుభవార్త వినపడకపోవచ్చు. ఆత్మకూరు కూడా చేజారుతోంది. జగన్ ఒంటెత్తు పోకడలు అక్కడ పార్టీని ముంచేశాయనే ప్రచారం ఉంది.
అనంతపురం జిల్లాలో ఒకటి రెండు మాత్రమే జగన్ కు కాస్త పాజిటివ్ గా ఉన్నాయి.
ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో వైసీపీకి మూడుకు మించి స్థానాలు దక్కే అవకాశం లేదు. పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు లలో మాత్రమే వారికి పరువు దక్కుతుంది. తెలుగుదేశం కూటమి సాధించబోతున్న అనూహ్యమైన మెజారిటీ సీట్ల పర్వంలో కడపజిల్లా కూడా తన వంతు పాత్ర పోషించబోతోంది. చిత్తూరు ఎంపీ పరిదిలో పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప మరెవ్వరూ వైసీపీ అబ్యర్థులు గెలిచేలా లేరు. తిరుపతి ఎంపీ నియోజకవర్గం పరిధిలో తిరుపతి, సత్యవేడు మినహా మిగిలిన చోట్ల జగన్ అభ్యర్థులు ఏటికి ఎదురీదుతున్నారు. కర్నూలు జిల్లాలో జగన్ కు కొంత ఊరట. పాణ్యం, పత్తికొండ, కోడుమూరు లలో పార్టీకి అవకాశాలున్నాయి. నందికొట్కూరు, నంద్యాల గట్టిపోటీ ఇస్తున్నారు. హిందూపురం పార్లమెంటు పరిధిలో ధర్మవరం లో కూడా గట్టిపోటీ ఉంది.
ఏ రకంగా చూసినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై మించి స్థానాలు దక్కే అవకాశం కనిపించడం లేదు. ఆ పార్టీ తరఫున రోజా సహా అనేక మంది మంత్రులు దారుణంగా ఓడిపోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వారు మాత్రమే నెగ్గుతున్నారు.
అంకెలపరంగా చూసినప్పుడు.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 10 నుంచి 15 స్థానాలు దక్కితే ఎక్కువ అన్నట్టుగా పరిస్థితి ఉంది. తెలుగుదేశం ఎన్డీయే కూటమి 150 నుంచి 161 స్థానాల్లో విజయం సాధించబోతోంది. భారతీయ జనతా పార్టీ తమకు బలం లేకపోయినా పట్టుబట్టి కొన్ని సీట్లు అదనంగా తీసుకోవడం వలన కూటమికి కొంత నష్టం జరగబోతోంది. జనసేన పవన్ కల్యాణ్ చిత్తశుద్ధితో కూటమి విజయానికి పనిచేస్తుండడం ఒక పెద్ద ఎడ్వాంటేజీ.
పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో జట్టుకట్టినప్పుడే విజయావకాశాల సమీకరణాలు చాలా మారిపోయాయి. మోడీ కూడా జట్టులోకి వచ్చిన తరువాత.. ప్రత్యేకించి మోడీ, అమిత్ షాలు ఏపీలో నిర్వహించిన సభల్లో జగన్ ప్రభుత్వాన్ని మట్టుపెట్టడం గురించి తీవ్రస్థాయిలో హెచ్చరించిన తర్వాత.. రాజకీయ వాతావరణంలో తేడా వచ్చింది. ప్రజల్లో జగన్ పట్ల ఉన్న అసంతృప్తికి ఈ మూడు పార్టీల ఐక్యత ప్రధాన కారణంగా తోడైంది. అంతా కలిసి రాష్ట్రంలో కొత్త చరిత్రను లిఖించబోతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి- తన మాటల్లో ప్రతిసారీ అంతా దేవుడి మీదికే నెట్టేస్తుంటారు. తన సొంత చిన్నాన్న వివేకానందరెడ్డిని ఎవరు చంపారనే విషయం కూడా ప్రజలందరికీ తెలుసు, ఆ దేవుడికి తెలుసు అంటారే తప్ప.. చంపినదెవరో తనకు తెలుసు అని మాత్రం అనరు. అలాగే తన పరిపాలన గురించి దేవుడే చెబుతాడని కూడా ప్రతిసారీ అంటుంటారు. ప్రజలకు, దేవుడికి తప్ప మరెవ్వరికీ తాను భయపడనని కూడా చెబుతుంటారు. దానికి తగ్గట్టుగానే.. జగన్ ప్రభుత్వం పతనం అవుతుండడం.. దేవుడి నిర్ణయమే అని ప్రజలు భావిస్తున్నారు.