కేకే సర్వేస్ కంటె ముందే.. telugumopo.com పర్ఫెక్ట్ జోస్యం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవ్వరి అంచనాలకూ అందనటువంటి అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అధికారంలోకి వస్తున్న చంద్రబాబునాయుడు అండ్ కూటమి నాయకులు గానీ, అధికారం నుంచి దిగిపోతున్న జగన్మోహన్ రెడ్డి గానీ.. ఎవ్వరూ ఫలితాలు ఇలా ఉంటాయని అంచనా వేయలేదు. ఈ సమయంలో కేకే సర్వేస్ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.

ఫలితాలు వెల్లడి కావడానికి ముందు.. కేకే సర్వేస్ మరియు ఆరా మస్తాన్ సర్వే ల గురించి ఎక్కువగా చర్చ జరిగింది. కేకే సర్వేస్ సంస్థ ఎన్డీయే కూటమికి ఏపీలో ఏకంగా 161 స్థానాలను కట్టబెట్టింది. అదే సమయంలో.. సుదీర్ఘకాలంగా సర్వేల్లో అనుభవం ఉన్న ఆరా మస్తాన్ వైసీపీకి ఘనవిజయం దక్కుతుందని జోస్యం చెప్పారు. టీవీ షోల్లోకి వచ్చి.. తాను చెప్పినదానికంటె పది సీట్లు పెరుగుతాయే తప్ప తగ్గవని అన్నారు. ఈ రెండు సర్వేలు రెండు ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్ లో ఉండడం వలన ప్రజల మధ్య వీటి గురించి ఎక్కువ చర్చ జరిగింది.

కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే.. కేకే సర్వేస్ కంటె ముందుగా.. telugumopo.com తెలుగుదేశం కూటమి విజయాన్ని పక్కాగా అంచనా వేసింది. కేకే సర్వేస్ చెప్పినది చివరి విడత పోలింగ్ తర్వాత.. ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రమే. కానీ telugumopo.com పోలింగుకు రెండురోజుల ముందే మేనెల 11 వ తేదీన తాము రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను వార్తాకథనంలో అందించింది. అందులో  తెలుగుదేశం కూటమికి 161 స్థానాలు దక్కబోతున్నాయని చెప్పడం జరిగింది. కేకే సర్వేస్ వెల్లడించడానికి 20 రోజుల ముందే telugumopo.com సర్వే వివరాలు పక్కాగా.. కూటమి సాధించిన విజయానికి దగ్గరగా రావడం గమనార్హం.

Telugumopo.com  సర్వేలో పేర్కొన్న అంశాలను స్థూలంగా గమనిద్దాం.

1) ఎన్డీయే కూటమికి 161 స్థానాలు పక్కాగా దక్కబోతున్నాయి. 15 సీట్లు కూడా దాటకుండా జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయం మూట్టుకోబోతున్నారు.
-అచ్చంగా ఇలాగే జరిగింది. నిజానికి కేకే సర్వేస్ కూడా 161 స్థానాలే ప్రిడిక్ట్ చేసింది. కానీ కూటమి ఇంకో అడుగు ముందుకు వేసి 164 స్థానాల్లో విజయం సాధించింది.

2) రాయలసీమలోనూ ముఖం చాటేస్తున్న ప్రజలు
– వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ ప్రజలు ఇచ్చిన షాక్ మామూలుగా లేదు. తాను ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన చోట కడప ఎమ్మెల్యే స్థానం కూడా జగన్ నిలబెట్టుకోలేకపోయారు. మేనమామను కూడా గెలిపించుకోలేకపోయారు. గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా వైసీపీ స్వీప్ చేయగా, ఈదఫా పెద్దిరెడ్డి సోదరులు పోటీచేసిన పుంగనూరు, తంబళ్లపల్లె మినహా మొత్తం తెదేపా స్వీప్ చేసింది. జగన్ సొంత జిల్లా కడపలో 10 స్థానాలకు గాను, ఏకంగా 7 స్థానాలు కూటమి గెలిచింది. కర్నూలు జిల్లాలో 14కు గాను వైకాపా గెలిచింది కేవలం 2 మాత్రమే. అనంతపురం జిల్లాలో వారి స్కోరు సున్నా! మొత్తం 14 కూటమి ఖాతాలోనే పడ్డాయి. ఈ స్థాయిలో రాయలసీమ ప్రజలు జగన్ ను ఛీకొట్టారు.

3) రాజధాని మాయను అసహ్యించుకున్న ఉత్తరాంధ్ర
.. రాజధాని అనే మాయను భూకబ్జాల కోసం నడిపించిన జగన్మోహన్ రెడ్డి.. అదేదో అభివృద్ధి మంత్రం అన్నట్టుగా ప్రజలను మభ్యపెట్టారు. కానీ.. ఈ మాయను యావత్ ఉత్తరాంధ్ర ఘోరంగా అసహ్యించుకుంది. విశాఖ ఉమ్మడి జిల్లాలో అరకు, పాడేరు మినహా.. మొత్తం ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా వైసీపీకి దక్కలేదంటే ప్రజలు ఎంతగా ఆ పార్టీని తిరస్కరించారో అర్థమవుతుంది.

4)  పతనంలో గోదావరోళ్ల ప్రత్యేక పాత్ర
.. వైఎస్సార్ కాంగ్రెస్ పతనం కావడంలో ఉభయగోదావరి జిల్లాలు కీలక భూమిక పోషించాయి. జనసేనతో తెలుగుదేశం పొత్తు ఆ కూటమికి బాగా కలిసి వచ్చింది. మొత్తం స్థానాలను స్వీప్ చేసేశారు.

5) అమరావతి ద్రోహానికి ఆంధ్ర చెంపపెట్టు
.. అమరావతి రాజధానికి జగన్ చేసిన ద్రోహం చిన్నది కాదు. దాని ప్రభావం ఆ ప్రాంతంలో పార్టీ పరాజయంపై స్పష్టంగా కనిపించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కూడా వైసీపీని దారుణంగా ఓడించాయి.

మొత్తానికి telugumopo.com సర్వే నివేదికలో చెప్పిన ప్రతి అక్షరమూ అక్షరసత్యంగా ఇవాళ నిరూపితమైంది. ఈ వెబ్ సైట్ 161 స్థానాలు అంచనా వేస్తే.. కేకే సర్వేస్ కూడా సరిగ్గా అదే అంచనాలతో చెప్పింది. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా వచ్చాయి. జగన్ కు 15 కూడా దక్కవని చెప్పగా.. ఆయన 11 స్థానాలకే పరిమితం అయ్యారు.

telugumopo.com జోస్యంలో చెప్పిన విధంగానే.. 2019లో జగన్ ను నెత్తిన పెట్టుకున్న జిల్లాలన్నీ ఈసారి దారుణంగా తిరస్కరించాయి. జగన్ ప్రతిసారీ దేవుడి ఆశీస్సుల గురించి ప్రస్తావిస్తుంటారు. ఆయనకు దక్కబోయే పరాజయం కూడా దేవుడి నిర్ణయమే అని ప్రజలు చెబుతున్నట్టుగా telugumopo.com ఆ కథనంలో పేర్కొంది. సరిగ్గా అదే స్థాయిలో ఇప్పుడు జగన్ పరాభవం సంపూర్ణం అయింది.

మే11న telugumopo.com  వెల్లడించిన సర్వేఫలితాల కథనం ఈ లింకులో చదవండి.

మే11న telugumopo.com  వెల్లడించిన సర్వేఫలితాల కథనం ఈ లింకులో చదవండి.


Related Posts

Comments

spot_img

Recent Stories