విజయ్‌ కొడుకు డైరెక్షన్‌ లో తెలుగు హీరో!

ఇళయదళపతి విజయ్ తమిళనాడులో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్‌ గోట్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఉంది. విజయ్‌ అతి త్వరలోనే  పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు  ఈ కారణంగా సినీ పరిశ్రమ నుంచి తప్పుకోనున్నాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు.

 కానీ విజయ్ కొడుకు జాసన్ సంజయ్ తమిళ సినీపరిశ్రమలో అడుగుపెడుతున్నాడు. కానీ తన తండ్రిలా హీరోగా కాదు మాత్రం కాదు.అవును జాసన్ సంజయ్ తన తాత అడుగుజాడల్లో నడుస్తూ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో ఇందుకు సంబంధించి 2023లో ప్రకటన కూడా చేసారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ఇన్నాళ్లు ఈ సినిమాలో నటించే హీరోఎవరు అనే చర్చ విపరీతంగా జరిగింది. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు జాసన్ డైరెక్షన్‌ లో నటిచబోయే హీరో మాన టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అని టాక్‌ నడుస్తుంది .సందీప్ కిషన్ తమిళ పరిశ్రమకు కొత్తేమి కాదు. గతంలో అనేక సూపర్ హిట్ సినిమాలలో ఈ యంగ్ హీరో నటించాడు. ఇటీవల ధనుష్ దర్శకత్వంలో వచ్చిన రాయన్ లోను సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించి అందర్ని మెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని కోలీవుడ్ టా

జాసన్ దర్శకత్వం వహించే ఈ సినిమాకు ఏఆర్‌. రెహమాన్ కొడుకు సంగీత దర్శకుడుగా పరిచయం కాబోతున్నట్టు కూడా ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories