భారతదేశ ప్రాంతీయ పార్టీల చరిత్రలోనే తెలుగుదేశం ఒక కొత్త శకాన్ని సృష్టించింది. కోటి దాటిన క్రియాశీల సభ్యత్వాలతో తెలుగుదేశం పార్టీ చరిత్ర పుటలకెక్కింది. ఆ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కోటి వరకు సభ్యత్వాలు నమోదు కావడం ఇదే మొట్టమొదటిసారి. సంక్రాంతి పర్వదినం నాడు ఈ అరుదైన ఫీట్ చోటుచేసుకుంది. కోటి దాటిన క్రియాశీల సభ్యత్వాలలో కేవలం 15 లక్షల మాత్రమే తెలంగాణకు సంబంధించిన గణాంకాలు. మిగిలిన 85 లక్షలకు పైగా పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉండడం విశేషం. ముందు ముందు ఎన్ని రకాల ఎన్నికలు వచ్చినా సరే పార్టీకి ఓటమిని ఎదురుపడనివ్వని అజేయమైన శక్తిగా తయారు చేయడానికి ఈ కోటి సభ్యత్వాలు నమోదు ఒక గొప్ప మైలురాయి అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పార్టీ నిర్వహణ పార్టీలో అంతర్గత వ్యవహారాల నిర్వహణ విషయంలో నారా లోకేష్ సారథ్యం తెలుగుదేశానికి కొత్త జవజీవాలను అందిస్తున్నదనే సంగతి గత కొన్ని సంవత్సరాలుగా పదేపదే నిరూపణ అవుతోంది. నారా లోకేష్ ప్రస్తుతం మూడో పర్యాయం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆ హోదాతో పార్టీ సారద్య బాధ్యతల సేకరించిన నాటి నుంచి నారా లోకేష్ అనేక విప్లవాత్మక నిర్ణయాలకు శ్రీకారం చుడుతూ వచ్చారు. పార్టీ కార్యకర్తలకు జీవిత బీమా సదుపాయం ఏర్పాటు చేయడం, పార్టీ తరఫున ప్రీమియంలు చెల్లించడం వంటివి లోకేష్ తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలలో కొన్ని మాత్రమే. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కోటి సభ్యత్వాల మైలురాయిని తెలుగుదేశం అధిగమించడం ప్రత్యేకమైన గర్వకారణంగా అందరూ చెప్పుకోవాలి.
తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో గానీ తెలుగుదేశం పోటీచేయకపోయినప్పటికీ కూడా అక్కడ కూడా 15 లక్షల సభ్యత్వాలు నమోదు కావడం అనేది తెలుగుదేశానికి క్షేత్రస్థాయిలో ఉండే బలాన్ని సూచించే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే అలాగే ఏపీలో కూడా 85 లక్షలు దాటిన సభ్యత్వాలు అంటే.. తెలుగుదేశం పార్టీ మరియు చంద్రబాబునాయుడు నాయకత్వం మీద ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న నమ్మకానికి తార్కాణం అనుకోవాలి.
ఈ కోటి క్రియాశీల సభ్యత్వాల్లో మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు అర్బన్, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, రఘురామక్రిష్ణ రాజు ఉన్న ఉండి తదితర నియోజకవర్గాల్లో లక్షకు మించిన సభ్యత్వాలు నమోదు కావడం విశేషం.