అన్నయ్యను ఇంత పచ్చిగా తిట్టిందేంటి చెప్మా!

జగన్ కు అసలు ఐడియాలజీ అనేది ఉందా? అనే మాట తిడితే.. ఏం పర్లేదులే.. అలాంటివి బోలెడంత మంది బోలెడు సార్లు తిడుతూనే ఉంటారు. జగనన్న అవన్నీ పట్టించుకోకుండా తన పాటికి తాను ట్వీట్లు చేసుకుంటూ కాలం గడుపుతుంటాడు అని సరిపెట్టుకోవచ్చు. కానీ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల, అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి.. ‘ఆయన చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా’ అని నిలదీయడం ఇప్పుడు ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఆస్తులకోసం వారిలో వారికి ఎన్ని తగాదాలైనా ఉండవచ్చు గాక.. కానీ.. ఈ స్థాయిలో తిట్టిపోయడం అనేది గతంలో ఎన్నడూ లేనిది అని ప్రజలు అనుకుంటున్నారు.

అయితే ఈ రేంజిలో వైఎస్ షర్మిలకు ఆగ్రహం రావడానికి బలమైన కారణం కూడా ఉన్నదని పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలి ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్లిన పీసీసీ సారథి వైఎస్ షర్మిల, తన వెంట కొడుకు వైఎస్ రాజారెడ్డిని కూడా తీసుకువెళ్లారు. సహజంగా మీడియా వాళ్లు రాజారెడ్డి రాజకీయ రంగప్రవేశం గురించి అడగడం, తప్పకుండా వస్తారని షర్మిల చెప్పడం జరిగింది. షర్మిల తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకువస్తానని అనగానే.. వైసీపీ దళాలకు కంగారు పుట్టింది. షర్మిల మీద, జగన్ తల్లి విజయమ్మ మీద కూడా అత్యంత చవకబారు బూతు విమర్శలు చేయడం ఆల్రెడీ అలవాటుగానే ఉన్న జగన్ దళాలు.. రాజారెడ్డి రాజకీయ ప్రవేశం మీద కూడా చకవబారు వ్యాఖ్యలు చేశారు. వీటిపట్ల షర్మిల కూడా ఒక రేంజిలో రెచ్చిపోయారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సైతాన్ సైన్యం ఎంత అరచి గీపెట్టినా.. నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు. రాజారెడ్డి ఎప్పటికీ.. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడే అవుతాడు.. అందులో ఎలాంటి సందేహం లేదు.. అంటూ ఆమె ఢంకా బజాయించి చెబుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడిని అని చెప్పుకునే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేనేలేదని షర్మిల తూలనాడుతుండడమ గమనార్హం. రాజశేఖర రెడ్డి బతికుంటే జగన్మోహన్ రెడ్డిని చూసి తలదించుకునేవాడని ఆమె అంటున్నారు.  రాజశేఖర రెడ్డి మరణంలో పాత్ర ఉన్నదని ఏ రిలయన్స్ సంస్థ గురించి అయితే జగన్ ఆరోపించారో.. అదే రిలయన్స్ సంస్థకు చెందిన వారికి ఎంపీ పదవిని కట్టబెట్టడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అని కూడా అంటున్నారు.

షర్మిల తన కొడుకు రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేసినంత మాత్రాన వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు మౌనంగా ఉంటే సరిపోయేది. ప్రతి నాయకుడు.. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకోవడం వింతేమీ కాదు. కానీ ఆమె చెప్పిన మాటలను కూడా ఆడిపోసుకోవడం ద్వారా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు.. షర్మిలతో చేజేతులా జగన్ ను మరింత ఘోరంగా తిట్టించినట్టుగా అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories