యంగ్ హీరో తేజ సజ్జ నటించిన తాజా సినిమా మిరాయ్ ఇటీవలి కాలంలో మంచి హిట్ గా నిలిచింది. రితికా నాయక్ హీరోయిన్ గా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిలీజ్ కి ముందు నుంచే పాజిటివ్ టాక్ తో బజ్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత కూడా ఆ అంచనాలను అందుకొని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది. తేజ సజ్జ కెరీర్ లో ఇదొక పెద్ద కలెక్షన్స్ సాధించిన సినిమా అయింది.
అయితే రిలీజ్ రోజున కొన్ని విషయాలు ఆడియెన్స్ కి కొద్దిగా నిరాశ కలిగించాయి. ట్రైలర్స్ లో, ప్రమోషన్స్ లో భారీగా హిట్ అయిన వైబ్ అనే పాట సినిమాలో ఎక్కడా లేకపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. దాంతో చాలామంది ఆ సాంగ్ మిస్సింగ్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఆ డిమాండ్ కి తగ్గట్టుగా మేకర్స్ ఆ పాటను థియేటర్లలో చూపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల ఆ సాంగ్ కోసం ఎదురుచూసిన వారికి ఇది నిజంగా సంతోషకరమైన వార్తే.