అప్పుడు హనుమాన్‌…ఇప్పుడు ఈ మూవీ!

టాలీవుడ్‌లో తెరకెక్కిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో ప్రేక్షకులను కలవడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో హీరో తేజ సజ్జా శక్తివంతమైన యోధుడి పాత్రలో కనిపించబోతుండటంతో ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ అయింది. హనుమాన్‌తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు మిరాయ్‌తో కూడా బాక్సాఫీస్ దగ్గర మరోసారి సెన్సేషన్ సృష్టించేందుకు రెడీగా ఉన్నారు.

ఈ సినిమాను నైజాం ప్రాంతంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో హనుమాన్ సినిమాను కూడా వీరే రిలీజ్ చేసి విజయవంతం చేశారు. ఆ అనుభవంతో మిరాయ్ పైన కూడా వీరికి పాజిటివ్ నమ్మకం ఏర్పడింది.

మరోవైపు, ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories