ఇటీవల తెలుగు సినిమా రంగంలో యువ దర్శకులు కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్స్ చూపిస్తున్నారు. అలాంటి క్రేజ్ క్రియేట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ “మిరాయ్”.
ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోగా నటిస్తుండగా, ‘ఈగల్’ సినిమాతో తన టాలెంట్‌ను నిరూపించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే మంచి బజ్ ఉండగా, ఇందులోని విజువల్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
టీజర్ విడుదలైన తర్వాత కొన్ని సీన్స్ చూసి అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో చేశారనే వ్యాఖ్యలు వచ్చాయి. కానీ ఈ వ్యాఖ్యలకు తేజ సజ్జ క్లారిటీ ఇచ్చాడు. ఇంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమాలో AI వాడటం అనేది సరైన మాట కాదని స్పష్టంగా చెప్పాడు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు స్వంతంగా సీజీ కంపెనీ ఉండటంతో, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా వీఎఫ్ఎక్స్ టీమ్ ప్రతిరోజూ 18 గంటలు పని చేసిందని కూడా వివరించారు. అంతేకాదు, ఆ వీఎఫ్ఎక్స్ వర్క్‌కు సంబంధించిన రియల్ ఫుటేజ్ కూడా ఉన్నదని తేజ చెప్పాడు.
దీంతో “మిరాయ్” గురించి వస్తున్న నెగిటివ్ కామెంట్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి.