జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా గురించి ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి హంగామా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా ‘డ్రాగన్’ అనే పేరుతో పిలుస్తున్నారు. షూటింగ్‌లో కొంత భాగం పూర్తి అయ్యింది. ఈ మధ్య తారక్ తన ఫిట్‌నెస్‌ను చూపించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది.
ఇక తాజాగా ఎన్టీఆర్ కాంతార తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఆ వేడుకలో ఆయన కనిపించిన కొత్త లుక్ మాత్రం అభిమానులను ఆశ్చర్యపరిచింది. స్లిమ్ బాడీతో, కొత్త స్టైల్ గడ్డంతో స్టేజ్‌పైకి వచ్చిన తారక్ రూపం చూసి అందరూ ఫిదా అయ్యారు. దీంతో ఆయన రాబోయే ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన లుక్‌పై క్లారిటీ అభిమానులకు వచ్చిందని చెప్పాలి.
ఈ భారీ సినిమాను హోంబళే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్‌లో వారు కాంతార సినిమాను కూడా రూపొందించారు.