ఆర్‌ఆర్‌ఆర్‌ 2 పై తారక్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు!

ఆర్‌ఆర్‌ఆర్‌ 2 పై తారక్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు! చాలా రోజులు తర్వాత ఆర్‌ఆర్ఆర్‌ అనే పేరు మరోసారి ఇండియన్ సినిమా దగ్గర గట్టిగా వినపడుతుంది. రెండు బిగ్గెస్ట్ మాస్ ఫోర్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసిన సెన్సేషనల్ మూవీనే ఆర్‌ఆర్‌ఆర్‌. మరి అంచనాలు మాట అటుంచితే అంతకు మించిన విలువైన పాన్ వరల్డ్ గుర్తింపుని ఈ సినిమా అందుకుంది. ఇలా గ్లోబల్ సెన్సేషన్ అయిన ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా మేకర్స్ ఒక ఎమోషనల్ రోలర్ కాస్టర్ రైడ్ లాంటి డాక్యు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మరి ఇందులో ఇక మొత్తం అయ్యిపోయింది టైటిల్స్ కూడా అయిపోయిన తర్వాత తారక్ తన మార్క్ ఫన్ తో RRR పార్ట్ 2 గురించి మాట్లాడాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ పార్ట్ 2 గురించి మీకేమన్నా తెలుసా? రాజమౌళి అయితే ఇప్పుడు వరకు నాకు ఎలాంటి అప్డేట్ ని ఇవ్వలేదు. పార్ట్ 2 ఉందా లేదా అనేది నాకు కూడా తెలీదు అంటూ తనదైన స్టైల్‌లో టీజ్ చేశారు. అయితే దీనితోనే మేకర్స్ పార్ట్ 2 ఉన్నట్టే హింట్ ఇచ్చారని చెప్పాలి. మరి ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడు మొదలు పెడతారో వెయిట్‌ చేయాల్సిందే మరి.

Related Posts

Comments

spot_img

Recent Stories