తారక్‌ ఆ సమాధానం వైరల్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “దేవర” సెన్సేషన్ వరల్డ్ వైడ్ ఎలా దూసుకుపోతుందో చూస్తున్నాం. తారక్ నుంచి చాలా కాలం తర్వాత సోలోగా వచ్చిన సినిమా అది కూడా తన నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా ఆ రేంజ్‌ హిట్‌ నే అందుకుంది.

మరి ఈ సినిమా విడుదలకి ముందు తారక్ ఇండియా వైడ్ గా ప్రమోషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అలా బాలీవుడ్ ఫేమస్ టాక్ షో కపిల్ శర్మ షోలో కూడా తారక్ పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో తనకి రాజకీయాలకి సంబంధించి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. తన అభిమానులని ఓటర్స్ గా మార్చుకునే అవకాశం ఏమన్నా ఉందా అంటే దానికి తారక్ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.

తాను తన అభిమానులు తన కోసం టికెట్స్ కొనుక్కునే వరకు ఉంటే చాలని అంతకు మించి ఇంకేమి వద్దు.. నేను ప్రస్తుతానికి ఇంతవరకు సంతోషం గానే ఉన్నాను. బహుశా నేను ఓ తెలివైన నిర్ణయాన్నే తీసుకున్నానని  అనుకుంటున్నాను అంటూ తారక్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. దీంతో ఫ్యాన్స్ లో ఈ సమాధానం వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories