దేవర సినిమాతో మరోసారి ఇండస్ట్రీ బాక్సాఫీసులను షేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా.. డివైడ్ టాక్‌తోనే ఏకంగా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. నిన్నటి వరకు దేవర విజయాన్ని ఆనందించిన తారక్…తాజాగా యుద్ధభూమికి బయల్దేరాడు.
చెప్పినట్టే.. నవంబర్ థర్డ్ వీక్‌లో వార్ 2 షూటింగ్ కోసం ముంబై విమానం ఎక్కేశాడు ఎన్టీఆర్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమా చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాను యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడనే తెలుస్తుంది.
ఇండియాస్ మోస్ట్ అవైటేడ్ మల్టీస్టారర్ సినిమా కావడంతో.. వార్ 2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ కంప్లీట్ చేసిన తారక్.. ఇప్పుడు వార్ 2 నెక్స్ట్ షెడ్యూల్ కోసం ముంబైకి పయనమయ్యాడు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, హృతిక్ పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ మాస్ సాంగ్ కూడా షూట్ చేయనున్నట్టుగా సమాచారం. వీలైనంత త్వరగా వార్ 2 షూటింగ్ ఫినిష్ చేసి.. వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెట్టే ఆలోచనలో తారక్ ఉన్నాడు.
నవంబర్‌లో ఎన్టీఆర్-నీల్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. డిసెంబర్లో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. ఈలోపు వార్ 2కి సంబంధించిన వర్క్ మొత్తం పూర్తి చేయనున్నాడు తారక్. 2025 ఆగష్టులో వార్ 2 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.