మళ్లీ ప్రమోషన్‌ మొదలు పెట్టనున్న తారక్‌!

మళ్లీ ప్రమోషన్‌ మొదలు పెట్టనున్న తారక్‌! మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన సాలిడ్ హిట్ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అనుకున్న అంచనాలు రీచ్ అయ్యి సాలిడ్ వసూళ్లు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాకి అప్పుడు తారక్ అహర్నిశలు పాన్ ఇండియా లెవెల్లో ఎలా ప్రమోషన్స్ చేసాడో అందరికీ తెలిసిందే. 

మరి ఇపుడు మళ్ళీ దేవర కోసం తారక్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసాడు. అదేంటి ఎప్పుడో రిలీజ్ అయ్యిపోయిన సినిమాకి మళ్ళీ ప్రమోషన్స్ అనుకుంటున్నారా? ఎన్టీఆర్ దేవర కోసం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది నిజమే కాకపోతే మన దగ్గర రిలీజ్ కోసం కాదు జపాన్లో రిలీజ్ కోసం తారక్ మళ్ళీ దేవర కోసం ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. 

ఈ మార్చ్ 28న జపాన్లో దేవర భారీ లెవెల్లో రిలీజ్ కాబోతుండగా ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ మాసెస్ అక్కడి మీడియాతో ముచ్చటించడం జరిగింది. ఇక మార్చ్ 22 న తారక్ జపాన్లో ల్యాండ్ అవ్వడమే కాకుండా రిలీజ్ వరకు అక్కడే తాను ప్రమోషన్స్ ని జోరుగా కొనసాగించనున్నాడట. మరి తారక్ కి జపాన్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి దేవర అక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories