టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో తారక్ పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండగా, ఆయన లుక్, ప్రెజెంటేషన్ కూడా కొత్త రీతిలో ఉండబోతుందనే సమాచారం వస్తోంది.
ఇటీవల ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగుపెట్టిన ‘వార్ 2’ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. దీంతో ఈసారి తన తదుపరి సినిమా ‘డ్రాగన్’ మీద ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ చిత్రం తన కెరీర్‌కు కొత్త ఉత్సాహం ఇవ్వాలని తారక్ నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.
చిత్ర యూనిట్ మాటల్లో చెప్పాలంటే, కథ, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని ఒక నూతన స్థాయిలో చూపించబోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర ప్రేక్షకులను కొత్తగా అలరించబోతోందని అంటున్నారు.