భారీ ధరకి తారక్‌, నీల్ ప్రాజెక్ట్ యూఎస్ హక్కులు!?

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న భారీ చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 31వ సినిమాగా అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం ఇంకా షూటింగ్ సెట్స్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టకుండానే సాలిడ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే యూఎస్ లో హక్కులు డీల్ కూడా కంప్లీట్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. సలార్, కల్కి 2898 ఎడి లాంటి ఎన్నో భారీ సినిమాలు యూఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేసిన సంస్థలు ఈ చిత్రంని సొంతం చేసుకున్నారు.

అయితే ఈ చిత్రానికి యూఎస్ లో రికార్డు డీల్ జరిగినట్టుగా ఇపుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఎన్టీఆర్ 31 కి ఏకంగా 50 కోట్ల మేర డీల్ వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనితో దేవర తర్వాత మళ్ళీ ఈ సినిమాకి ఎన్టీఆర్ కెరీర్లో సహా మన టాలీవుడ్ సినిమాలలో చూసుకున్నా కూడా భారీ డీల్ జరిగినట్టుగా ఇపుడు తెలుస్తుంది. ఇక ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా తారక్ ఈ ఏప్రిల్ 22 నుంచి సెట్స్ లో అడుగు పెట్టనున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories