తారక్‌ నీల్‌ సినిమా ..ఊహించని షాక్‌!

ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవగా, రీసెంట్‌గా ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఇక ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా సెట్ నుంచి ఓ ఊహించని పిక్ ఇప్పుడు బయటకు వచ్చింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఓ సాలిడ్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నాడట. దీని కోసం ఆయన ఓ వేరే లెవెల్ సెట్ కూడా సెట్‌ చేసేసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశారు. ప్రశాంత్ నీల్ సెట్‌లో బిజీగా ఉండగా, ఆయన వెనకాల నుంచి లిఖిత ఓ ఫోటో తీసింది. ఈ ఫోటోకు ‘మ్యాడ్ సెట్‌లో మ్యాడ్ మనిషి’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది.

దీంతో ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎలాంటి సెట్ వేశాడా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఇదివరకు ఎవరూ చూపెట్టని విధంగా  నీల్ చూపింబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories