బన్నీకి తారక్‌ ఫోన్‌!

అల్లు అర్జున్ అరెస్ట్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనలో నిన్న అరెస్ట్ అయిన బన్నీ.. నేటి ఉదయం మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. జైలు నుంచి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ను  పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా తరలి వచ్చారు.

ఇప్పటికే దర్శక నిర్మాతలతో పాటూ పలువురు స్టార్ హీరోలు బన్నీ నివాసానికి వస్తున్నారు.అంతేకాక ఆయన్ని పరామర్శించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా  తన సంఘీభావాన్ని తెలిపారు. ప్రస్తుతం వార్‌ – 2 షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్న తారక్..  అల్లు అర్జున్‌కు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు.

ఈ మేరకు అరెస్టు పరిణామాలపై విచారం వ్యక్తం చేస్తూ బన్నీకి తన సంఘీభావం ప్రకటించారు. తారక్ తో బన్నీ ఫోన్ లో సంభాషిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా ముంబై నుంచి హైదరాబాద్ రాగానే జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ ను ఇంటికి వెళ్లనున్నట్లు సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories