దుమ్ము లేపిన తండేల్‌!

దుమ్ము లేపిన తండేల్‌! అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య కథానాయకుడిగా, లేడీ పవర్‌ స్టార్‌ సాయి పల్లవి ఫీమేల్ లీడ్ లో పలు వాస్తవ సంఘటనలు ఆధారంగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన తాజా సినిమా “తండేల్”. 

మరి ఎన్నో అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ సినిమా సాలిడ్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఈ సినిమా డే 1 పై కూడా అక్కినేని అభిమానులు చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు. దీంతో వాటికి రీచ్ అయ్యేలా సాలిడ్ నెంబర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. 

డే 1 కి గాను 21.27 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ నెంబర్ విడుదల చేశారు. దీంతో నాగ చైతన్య కెరీర్లో ఇది రికార్డు నెంబర్ గా నిలిచింది అని చెప్పాలి. మరి డే 2 అండ్ 3 లలో ఎలా ఉంటాయో కూడా చూడాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories