దుమ్ము లేపుతున్న తండేల్‌ బుకింగ్స్‌!

దుమ్ము లేపుతున్న తండేల్‌ బుకింగ్స్‌! అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘తండేల్’ రేపు వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ విడుదలకు సిద్ధం అయ్యింది. ఈ సినిమాను డైరెక్టర్‌ చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. పూర్తి లవ్ స్టోరీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. 

ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఈ మూవీపై సాలిడ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో టికెట్ బుకింగ్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఇప్పటికే బుక్ మై షో లో ఏకంగా 100K టికెట్ బుకింగ్స్ జరిగినట్లు మేకర్స్ తెలియజేశారు. 

దీంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో నాగచైతన్య తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో చెబుతోంది. ఈ సినిమాలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories