సెకండ్‌ పాట పై తమన్‌ వివరణ

మెగా పవర్‌ స్టార్  , గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కోలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్‌ మూవీ గేమ్‌ ఛేంజర్‌. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన ‘జరగండి జరగండి..’ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఇప్పుడు సెకండ్ సాంగ్‌గా ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ రాక‌కు రంగం అంతా సిద్దమైంది.

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ త‌న‌దైన స్టైల్లో ‘గేమ్ ఛేంజ‌ర్’ సెకండ్ సాంగ్‌ను చిత్రీకరించి.. రూపొందించారు. ‘‘గేమ్ ఛేంజ‌ర్‌లోని రా మ‌చ్చా మ‌చ్చా సాంగ్‌లో అన్నీ సంస్కృతుల‌ను చూపించ‌టం కన్నుల పండువలా ఉంది. శంక‌ర్‌గారు చాలా హుక్ లైన్స్‌ అందించారు. చివ‌ర‌కు రా మ‌చ్చా మ‌చ్చా.. అనే లైన్‌ను సెల‌క్ట్ చేసుకున్నారు. పాట‌ను స్క్రీన్‌పై చూస్తున్న‌ప్పుడు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 30న పాట విడుదలకు సిద్దంగా ఉందని తమన్‌ చెప్పుకొచ్చారు.

Related Posts

Comments

spot_img

Recent Stories