కన్నప్పలో స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న తమన్నా!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు మోహన్‌ బాబు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌ అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు నటిస్తున్నారు.

ముందు ఈ సినిమాని తక్కువ బడ్జెట్‌ తోనే పూర్తి చేయాలని అనుకున్నప్పటికీ కథ డిమాండ్‌ ప్రకారం తారాగాణాన్ని తీసుకోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు .

తాజాగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. .  తమన్నాఈ సినిమాలో  ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం.  ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ద్వారా మంచి అవుట్ ఫుట్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ బిగ్ స్టార్స్ అంత కూడా సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ మూవీకి సంబందించి మేకర్స్ త్వరలోనే మరిన్ని కీలక అప్డేట్స్ ఇవ్వనున్నారు.  .

Related Posts

Comments

spot_img

Recent Stories