స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఘాటి సినిమాతో సెప్టెంబర్ 5న ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఘాటి తర్వాత ఆమె చేయబోయే కొత్త ప్రాజెక్ట్‌పై కూడా సినీ వర్గాల్లో ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుసుకుంటే, అనుష్క తొలిసారిగా మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోందట. రొజిన్ థామస్ తెరకెక్కిస్తున్న కథనార్ – ది వైల్డ్ సోర్సరర్ అనే భారీ చిత్రంలో ఆమె కీలకమైన పాత్ర పోషించనుందని సమాచారం. ఈ చిత్రంలో మలయాళ స్టార్ జయసూర్య ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే, ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. తొమ్మిదో శతాబ్దానికి చెందిన మాయా శక్తులు కలిగిన క్రైస్తవ పూజారి కథనార్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఈ కథను తెరకెక్కిస్తున్నారని మాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.