యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం చేస్తున్న అతి ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘స్వయంభూ’ షూటింగ్ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. భరత్ కృష్ణమాచారి , ఆదిత్య బాహుదానం కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఒక హిస్టారికల్ ఎపిక్ గా రూపొందుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో నిఖిల్ కొత్తగా కనిపించనున్నాడు. తన స్టైల్ కు తగిన యాక్షన్ సీన్స్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకు వచ్చిన లుక్స్, పోస్టర్స్ వల్లే సినిమాపై ఓ ఆసక్తికరమైన హైప్ ఏర్పడింది. ఇకపోతే ఇప్పుడు టీజర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నిఖిల్ స్వయంగా పంచుకున్నాడు.
తక్కువ టైమ్ లోనే టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. టీజర్ అందరికీ ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని కూడా చెప్పారు. దీనితోనే టీజర్ పై అభిమానుల్లో ఆతృత మరింత పెరిగిపోయింది. మరోవైపు ఈ సినిమాలో సంయుక్త మీనన్, నభా నటేష్ లు కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాతో నిఖిల్ మరో సారిగా తన కెరీర్లో వేరే స్థాయికి చేరుతాడా అన్న ఉత్సాహం ఫ్యాన్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది.