పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందిన పీరియాడిక్ హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సినిమా. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికీ షూటింగ్, రిలీజ్ వాయిదాలు అనేక మార్లు ఎదురైనా, ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. రిలీజ్ సమయం దగ్గరపడటంతో చిత్రబృందం అంచనాలకు తగ్గట్టే ప్రమోషన్లు మొదలు పెట్టింది. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు ఏర్పాటు చేశారు. అయితే పరిస్థితులు చూస్తే కొన్ని చోట్ల బుకింగ్స్ ఎప్పుడో ప్రారంభమయ్యాయి. కానీ నైజాం ప్రాంతంలో మాత్రం పరిస్థితి తేడాగా కనిపిస్తోంది. అక్కడే ప్రీమియర్ షోలు ఈ రోజు నుంచే ఉండాల్సినా కూడా, బుకింగ్స్ ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.
పర్మిషన్లు వచ్చేశాయ్, టికెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయినప్పటికీ బుకింగ్స్ లేకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలు ఏంటనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు, బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.