కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన తాజా చిత్రం ‘రెట్రో’ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించాడు. యాక్షన్, డ్రామా, రొమాన్స్ మిక్స్‌తో కూడిన కథాంశంతో రూపొందిన ఈ సినిమాతో సూర్య తిరిగి హిట్టు కొడతాడనే ఆశలు అభిమానుల్లో ఎక్కువగా కనిపించాయి. కానీ థియేటర్లలో మాత్రం ఈ మూవీ అంచనాల్ని అందుకోలేక పోయింది. తమిళంలో ఓ మోస్తరు రెస్పాన్స్ రాగా, తెలుగు ప్రేక్షకుల్ని మాత్రం అంతగా ఆకట్టలేకపోయింది.
ఇక సినిమా ఓటిటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాతే అసలైన మ్యాజిక్ జరిగింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల రిలీజైన ఈ మూవీ హాఫ్ మిలియన్ వ్యూస్‌ను ఒక్క వారం లోపే దక్కించుకుంది. ట్రెండింగ్‌లో కొనసాగుతున్న ఈ సినిమాకు ఓటిటీలో మంచి స్పందన లభించడం విశేషం. థియేటర్లలో ఫెయిల్ అయినా, డిజిటల్ ప్లాట్‌ఫాంలో మంచి ఆదరణ రావడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాతలుగా సూర్య యొక్క 2డి ఎంటర్టైన్మెంట్స్ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. మొత్తం మీద థియేటర్లలో నిరాశపరిచిన ‘రెట్రో’ ఓటిటీలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.