సర్ప్రైజ్ బ్రేక్! నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసగా సినిమాలు అనౌన్స్ చేసి ఉన్నాడు. ఇప్పటికే ఆయన ‘హిట్-3’ షూటింగ్ ముగించుకోవడం తో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్ నుంచి వచ్చిన ‘కోర్ట్’ చిత్ర ప్రమోషన్స్‌లో నాని పాల్గొన్నారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కావడం, హిట్ సాధించడం కూడా జరిగిపోయాయి.
అయితే, తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’లో నటించబోతున్నాడు నాని. కానీ, ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా షూటింగ్ ఇక వేసవి తర్వాతే ప్రారంభం అవుతుందని చిత్ర వర్గాల టాక్.
దీంతో నానికి ఊహించిన విధంగా బ్రేక్ లభించింది. ఈ బ్రేక్ సమయంలో తన ఫ్యామిలీతో కలిసి ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేయాలని నాని చూస్తున్నాడట. ఈ హాలిడే ట్రిప్ తర్వాత ‘ప్యారడైజ్’ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటాడట ఈ హీరో. మరి ఈ సినిమాకు వచ్చిన బ్రేక్ ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ డ్రామాగా చిత్ర యూనిట్ రూపొందించనున్న సంగతి తెలిసిందే.