మరో క్రేజీ ఆఫర్‌!

తమిళ హీరో సూర్య తెలుగులో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా ? అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పారు. ఏ గెటప్ లు, సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని వెంకీ, సూర్యకి చెప్పారు. 

ఈ సినిమా మే నుంచి స్టార్ట్ కాబోతుంది. సితార నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత. అన్నట్టు ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారు. అయితే, భాగ్యశ్రీ భోర్సే ను ఇంకా ఫైనల్ చేయలేదు. కాకపోతే, ఆమెనే మెయిన్ హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందట. 

ఇప్పటికే, భాగ్యశ్రీ భోర్సే.. విజయ్ దేవరకొండ, రామ్ సరసన సినిమాలు చేస్తోంది. నిజానికి భాగ్యశ్రీ భోర్సే, తొలి సినిమా మిస్టర్ బచ్చన్ ప్లాప్ అయింది. అయినప్పటికీ, భాగ్యశ్రీకి మాత్రం తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సూర్య సరసన ఆమెకు ఛాన్స్ వచ్చింది.

Related Posts

Comments

spot_img

Recent Stories