తాజా సమాచారం ఏంటంటే!

తమిళ హీరో సూర్య – వెంకీ అట్లూరి కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నుంచి వెంకీ అట్లూరి సినిమాకు సూర్య తన షెడ్యూల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐతే, ఈ సినిమాలో హీరోయిన్ గా మేకర్స్ మొదట భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని, ఆ తర్వాత మరో హీరోయిన్ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారని వార్తలు షికారు చేశాయి. ప్రస్తుతం హీరోయిన్ ప్లేస్ లోకి మరో గ్లామరస్ బ్యూటీ సంయుక్త మీనన్ పేరు కూడా వినపడుతుంది.

కాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తుండగా జీవీ ప్రకాష్ సంగీతం అందించబోతున్నాడు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాల్సిందే. అన్నట్టు ప్రస్తుతం సూర్య, కార్తీక్ సుబ్బరాజ్ డైరక్షన్ లో రెట్రో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత, సూర్య.. వెంకీ అట్లూరి సినిమాను పూర్తి చేయనున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories