సుప్రీం షాకింగ్ తీర్పు : వైసీపీ చిలకల పాచిక పారలేదు!

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా.. తమంత తాముగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తామే విచారణ కోరినంత మాత్రాన.. తాము సచ్ఛీలురుగా తేలిపోతామేమో అనే భ్రమలో ఉన్నట్టుగా వైసీపీ నాయకులు సుప్రీం తలుపు తడితే.. వారికి షాకింగ్ తీర్పువెలువడింది. ఎవరు కోర్టుకు వెళితే వారు కరక్టే అని తేలుతుందేమో అనుకున్నట్టుగా వారు ప్రవర్తించారు గానీ.. తీర్పు వారికి ఇబ్బందికరమే. తిరుమల వేంకటేశ్వరస్వామివారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ విషయంలో.. ఆరోపణలు వచ్చిన వెంటనే లోతుగా దర్యాప్తు జరిపించాలంటూ గతంలో టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లారు. మరో మూడు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం.. స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తు జరిపించాలని ఆదేశించింది. ఈ తీర్పు వైసీపీకి మింగుడు పడకపోవచ్చు. 

వైసీపీ గూటి చిలకలే సుప్రీం కోర్టును ఆశ్రయించారనే వాదన ప్రబలంగా వినిపించింది. నెయ్యి కల్తీ విషయంలో నిజాలను నిగ్గు తేల్చడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికార్లతో ఒక సిట్ ఏర్పాటుచేసింది. వారు మూడురోజులు దర్యాప్తు కూడా చేశారు. టీటీడీ సిబ్బంది పలువురితో మాట్లాడి వివరాలు కూడా స్వీకరించారు. ఈలోగా సుప్రీం కేసును విచారిస్తూ సిట్ దర్యాప్తు ఆపవలసిందిగా ఆదేశించింది. డీజీపీ ఆ సిట్ దర్యాప్తును ఆపేయించారు. అక్కడికే వైసీపీ దళాలు పండగ చేసుకున్నాయి. నిజానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలనేది వారి డిమాండు. 

ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెలురించింది. అయిదుగురు సభ్యుల ప్రత్యేక బృందంతో సిట్ ఏర్పాటుచేసి దర్యాప్తు చేయించాలనేది సుప్రీం తీర్పు సారాంశం. ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు పోలీసు అధికారులు, ఒక ఎఫ్ఎస్ఎస్ఏఐ సీనియర్ అధికారి ఉండేలా పేర్కొన్నారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరక్టర్ పర్యవేక్షించేలా సుప్రీం ఆదేశించింది. 

జగన్ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, చీటికిమాటికీ జగన్ అద్భుతాలు సృష్ఠిస్తున్నారంటూ ఆయనను భజనచేస్తూ వచ్చిన బిజెపి మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తదితరులు పిటిషన్లు వేయడం ద్వారా ఆశించింది వేరు. వచ్చిన తీర్పు వేరు. ఇది వారికి మింగుడుపడదని, దర్యాప్తులో వాస్తవాలు వెల్లడయ్యే కొద్దీ.. ఇంకా ఇరుకున పడతారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories