మిస్‌ యూ నాన్న..అంటూ సూపర్‌ స్టార్‌ ఎమోషనల్ ట్వీట్‌!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పేరును సువర్ణాక్షరాలతో రాసుకున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ 81 వ జయంతి నేడు. ఈ సందర్భంగా తండ్రిని స్మరించుకుంటు స్టార్ హీరో మహేశ్‌ బాబు భావోద్వేగానికి గురయ్యారు. హ్యపీ బర్త్‌డే నాన్నా, నిన్ను ఎంతగానో మిస్‌ అవుతున్నా అంటూ మహేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ఎంతగానో మిస్‌ అవుతున్నా. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ ఉంటావు’ అని మహేష్ రాసుకొచ్చారు.

 కృష్ణ 2022 నవంబర్ 15న మరణించారు. 79 ఏళ్ల వయసులో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 1943 మే 31న కృష్ణ పుట్టారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారు. అభిమానుల మనసుల్లో ‘సూపర్ స్టార్’గా చెరగని ముద్ర వేశారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories