గొంతు సవరించిన సూపర్‌ స్టార్‌!

హాలీవుడ్‌లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన మూవీ ‘ది లయన్ కింగ్’ . ఈ సినిమాకి  ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వాల్ట్ డిస్నీ సంస్థ నుంచి వచ్చిన ఈ సినిమాకు ఇండియాలోనూ మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘ముఫాసా – ది లయన్ కింగ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను కూడా పలు భాషల్లో విడుదల చేస్తుండటంతో ఇండియన్ ఆడియెన్స్ ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌పై చూసేందుకుచాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక తెలుగులో ఈ సినిమాలోని ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నట్లు ఇప్పటికే వాల్ట్ డిస్నీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. మహేష్ బాబు వాయిస్ ఓవర్‌కు టాలీవుడ్‌లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ గొంతు వినిపించినా చాలు సినిమా సూపర్‌ సక్సెస్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఫుల్లుగా ఉంది

ఇప్పుడు దీనిని నిజం చేస్తూ ‘ముఫాసా’ పాత్రకు మహేష్ వాయిస్ పవర్‌ఫుల్‌గా సూట్‌ అయ్యింది. తెలుగు నేటివిటీలో మహేష్ చెబుతున్న డైలాగ్స్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నాయి. ‘‘ముఫాసా పాత్రకు వాయిస్ ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు ఇది చాలా ప్రత్యేకం.’’ అంటూ మహేష్ తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా తన ట్విటర్‌ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం వాయిస్ ఓవర్‌లు కూడా మనకు వినిపించాయి.

దీంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని డిసెంబర్ 20న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

Related Posts

Comments

spot_img

Recent Stories