ఫ్యామిలీతో వెకేషన్‌కు బయల్దేరిన సూపర్‌ స్టార్‌..లుక్ అదిరిందంతే!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన గుంటూరు కారం సినిమా తరువాత టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌ లో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై మహేష్‌ ఫుల్‌ ఫోకస్ పెట్టారు. ఈ మూవీ  కోసం మహేష్ తన లుక్ ను చేంజ్ చేసారు. ఈ సినిమా కోసం మహేష్ బరువు పెరిగే పనిలో కూడా ఉన్నారు.

డైట్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉండే మహేష్ ప్రస్తుతం లిమిట్‌ లేకుండా తింటున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ సిక్స్ ప్యాక్  లో కనిపించనున్నట్లు ఓ టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది. రాజమౌళి ఈ సినిమాను ఆఫ్రికన్ అడ్వెంచరస్ మూవీగా రూపొందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహేష్ ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి వెకేషన్ కు వెళ్తున్నారు. అందుకు సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపించిన మహేష్…ఇప్పుడు గడ్డం కొంచెం ట్రిమ్ చేసి మరింత అందంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories