మిరాయ్‌లో సూపర్‌ స్టార్‌..!

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా వస్తున్న తాజా చిత్రం మిరాయ్ విడుదలకు ముందే మంచి హంగామా క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆయన సూపర్ హీరో లుక్‌లో కనిపించబోతుండటంతో యువ ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూడాలా అని ఎదురుచూస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సినిమా ప్రమోషన్స్ విషయంలో తేజ సజ్జా చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. ఇదే సమయంలో జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో విలేకరి అడిగిన ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీజర్‌లో శ్రీరాముడి గ్లింప్స్ కనిపించాయని, ఆ పాత్రను మహేష్ బాబు పోషించారా అని ఒకరు ప్రశ్నించారు. దీనికి తేజ సజ్జా స్పందిస్తూ మహేష్ బాబు ఈ సినిమాలో లేరని చెప్పాడు. అయితే శ్రీరాముడి పాత్రలో ఎవరు కనిపిస్తారు అనే విషయాన్ని ఇప్పుడు రివీల్ చేయలేమని క్లారిటీ ఇచ్చాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories