అంబానీ పెళ్లికి సూపర్‌ స్టార్‌!

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి ఏ రేంజ్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ల వివాహం శుక్రవారం ఎంతో వేడుకగా జరగనుంది. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‏ ఈ వేడుకకు వేదిక అయ్యింది. అనంత్-రాధిక పెళ్లి కోసం ఇప్పటికే వివిధ దేశాల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, నటీనటులు అతిథులుగా విచ్చేశారు.

దాంతో జియో వరల్డ్ సెంటర్‏ మొత్తం సందడిగా మారింది.అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుక కోసం గురువారమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబంతో కలిసి ముంబైకి వెళ్లాడు. ఈరోజు ఉదయం ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు వెళ్లాడు. మహేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో  ప్రస్తుతం వైరల్‌  అయ్యాయి. మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. లాంగ్ హెయిర్, గడ్డంతో హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఇటీవల ఫ్యామిలీతో కలిసి లండన్, జర్మనీకి వెకేషన్‌కు వెళ్లిన మహేష్.. రెండు రోజుల క్రితమే ఇండియా తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories