విదేశాలకు సూపర్ స్టార్!

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. దానికి ప్రస్తుతం వర్కింగ్‌ టైటిల్‌ గా ఎస్‌ఎస్‌ఎంబీ 29 అని పెట్టారు. ఈ సినిమాని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ పై నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం మహేష్ బాబు తన కసరత్తులు మొదలు పెట్టేశాడు. కొద్ది రోజుల క్రితం మహేష్‌ ఓ రెండు యాడ్‌ షూటింగ్ లలో పాల్గొన్నాడు. ఆ తరువాత సమ్మర్ హాలీడేస్ కోసం ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశాలకు బయల్దేరాడు. ఈ సందర్భంగా వారు విమానాశ్రయంలో ఉన్న కొన్ని చిత్రాలను మహేష్‌ భార్య నమ్రత తన ఇన్‌ స్టాలో పోస్ట్‌ చేసింది.

అందులో మహేష్‌ లుక్‌ కొత్తగా ఉండడంతో రాజమౌళి సినిమా కోసం ఆయన కష్టపడుతున్నట్లు అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories