అదిరిపోయే లుక్‌ లో సూపర్‌ స్టార్‌!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళితో తన కెరీర్ 29వ సినిమాని చేస్తున్న సంగతి  తెలిసిందే. మరి ఈ భారీ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉండగా ఈ గ్యాప్ లో మహేష్ బాబు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం తన కొత్త లుక్ ని సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా సార్లు తన లుక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ కాగా తాజాగా మరో పిక్ వైరల్ గా మారింది.

తన ఇద్దరు పిల్లలు గౌతమ్ ఘట్టమనేని అలాగే సితార ఘట్టమనేని లతో కలిసి మహేష్ కనిపించిన పిక్ ఒకటి బయటకి వచ్చింది. మరి తన ఇద్దరు క్యూట్ కిడ్స్ తో మహేష్ బాబు సూపర్ మాస్ డాషింగ్ లుక్ లో అభిమానులకు కనువిందు చేస్తున్నారు. దీంతో ఈ స్పెషల్ పిక్ ఫ్యాన్స్ లో మంచి ఫోటో మూమెంట్ గా మారింది. ఇక మహేష్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ మురారి ఈ ఆగస్ట్ లోనే తన బర్త్ డే కానుకగా రీరిలీజ్ అయ్యి భారీ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories