హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్హుడ్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని గ్రాండ్ రిలీజ్కు రెడీ అయ్యింది. ఈ సినిమాను మార్చి 28న గ్రాండ్ రిలీజ్కు రెడీ చేశారు. దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఎంటర్టైనింగ్గా ఉండటంతో చిత్ర యూనిట్ కూడా ఈ మూవీపై మంచి అంచనాలు పెట్టుకుంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో హీరో నితిన్ కూడా ఇదే విషయాన్ని రివీల్ చేశాడు. ఇప్పటికే సినిమాను తాను చూశానని.. దర్శకుడు వెంకీ కుడుములతో పాటు తన కెరీర్లోనూ ఇది బెస్ట్ మూవీగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.