మరోసారి రిపీట్‌ కాబోతున్న సూపర్‌ హిట్‌ కాంబో!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబోలో 6 సంవత్సరాల క్రితం వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాలో చరణ్‌ యాక్టింగ్‌ కి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. దాంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌ లో సినిమా వస్తే బాగుండు అని ఎదురు చూసే అభిమానులకు గుడ్‌ న్యూస్‌ వీరిద్దరి కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది.

అయితే చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాని తరువాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో జాన్వీ కపూర్‌ తో కలిసి ఓ సినిమాని లైన్‌ లో పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ రెండు సినిమాలు ఇంకా లైన్లో ఉండగానే చరణ్ మరో డైరెక్టర్‌ తో సినిమా చేసేందుకు రెడీ అయిపోయాడు.

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా.. సుకుమార్‌. రామ్‌ చరణ్‌ కెరీర్‌ లో 17 వ సినిమాగా ఈ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించబోతున్నారని సమాచారం.దీనికి సంబంధించిన రెండు గుర్రాల పోస్టర్‌ తో రోరింగ్‌ టూ కాంకర్‌ అనే ఉపశీర్షిక తో మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ రైటింగ్స్‌ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేశారు.

ఈ సినిమాని రంగస్థలాన్ని మించేలా తీర్చిదిద్దాలని చిత్ర బృందం భావిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories