వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిగానీ, కడపజిల్లా లోని ఆయన అనుచర గణాలకు గానీ.. బుర్ర నిండా ఫ్యాక్షన్ బుద్ధులు నిండి ఉంటాయనడంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానమూ లేదు. పైకి ఆధునిక రాజకీయ నాయకుల వేషభాషల్లో తిరుగుతున్నారు గానీ.. లోలోపల వారి మూలాల్లో ఉన్న కంటెంట్ అదే అనే సంగతి అందరికీ తెలుసు. తన ప్రత్యర్థుల మీద.. ఎవరివల్లనైతే తనకు ఇబ్బంది ఉంటుందని భావిస్తున్నారో అలాంటి వారిమీద.. కేసులరూపంలోకి రాలేనటువంటి విధంగా రకరకాలుగా నష్టాలు కలిగిస్తూ ఉండడం ఇప్పుుడు వారు తమ మార్గంగా ఎంచుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది.
మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఫ్యాక్షనిస్టులు తమ తగాదాల్లో భాగంగా.. తమ ప్రత్యర్థులకు చెందిన అరటితోటలను.. కాపుకు వచ్చిన సమయంలో సమూలంగా నరికేయిస్తుంటారు. అలాగే.. తమ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను నాశనం చేసి.. వారిని నష్టపరచాలనే కక్షతో వారి చీనీతోటలను సమూలంగా నరికేయిస్తుంటారనే వార్తలను కూడా మనం తరచూ గమనిస్తుంటాం. సినిమాల్లో కనిపించే ఇలాంటి సన్నివేశాలు.. నిజజీవితాల్లోని ఫాక్షనిస్టుల అకృత్యాలను చూసి తయారైనవే. ఇలాంటి దారుణాలన్నీ పోలీసు కేసులుగా మారి ఏళ్లతరబడి కోర్టుల్లో నానుతూ ఉండడం కూడా మనకు తెలుసు.
ఇప్పుడు కడప జిల్లాలోని జగన్ దళాలు సరికొత్త పంథాను ఎంచుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే కూడా కామెడీగా కనిపిస్తుంది. అలాగని నష్టం మాత్రం జరుగుతూనే ఉంటుంది. అలాంటి దొంగమార్గాల్లో తమ రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నారు.
ఇలాంటి ఆర్థికమూలాలను నష్టపరిచే అరాచకాలకు బలవుతున్నది మరెవ్వరో కాదు.. జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయి అయిన వివేకానందరెడ్డి కూతురు సునీతనే! ఇంతకూ ఆమె ఏ రకంగా నష్టపోతున్నారో తెలుసా? సింహాద్రిపురం మండలం రావుకొలను వద్ద ఉన్న వారి పొలాల్లోని పంటల మీదికి పశువుల మందలు దండెత్తినట్టుగా వచ్చి పడుతున్నాయి. ఆ పంటలను నాశనం చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను పశువులు తొక్కి మేసి ఎందుకూ పనికిరాకుండా చేసేస్తున్నాయి. మామూలుగా అయితే ఈ మాట చెప్పుకోడానికి కూడా కామెడీగా ఉంటుంది. పెద్దలకు చెబితే.. ఏదోు పొరబాటున గొడ్లు వచ్చుంటాయి లేమ్మా.. పాలేళ్లను కాపలా పెట్టుకో అని అంటారు. కానీ.. హైదరాబాదులో ఉండే సునీత దంపతులు స్వయంగా దగ్గరుండి చూసుకోలేరు గనుక.. జగన్ దళాలు కుట్రపూరితంగా ఆమెకు కలిగిస్తున్న నష్టం ఇది. తన తండ్రి హత్యలో అసలు నిందితులను తేల్చడం గురించే అలుపెరగని పోరాటం చేస్తున్న సునీత.. ఈ విషయాన్ని కూడా అంత తేలిగ్గా విడిచిపెట్టడం లేదు. పులివెందుల పరిధిలో ఇటీవలి కాలంలో జరిగిన అనేక పరిణామాలతో పాటు, ఇలా తమ పొలాల్లకి గొడ్లను తొలించి నష్టం కలిగిస్తున్న తీరు గురించి కూడా ఆమె పులివెందుల డీఎష్సీని కలిసి ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారో.. జగన్ దళాల దుర్బుద్ధులకు బలవుతున్న సునీత పొలాల విషయంలో ఏం న్యాయం చేస్తారో చూడాలి.