క్లారిటీ ఇచ్చిన సుజీత్‌!

‘ఓజీ’ సినిమా విడుదలై కొద్ది రోజులకే ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో భారీ హిట్‌గా ఈ చిత్రం నిలిచింది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్‌ను అభిమానులు చూడాలనుకున్న అట్టహాసమైన స్టైల్‌లో చూపించడం విశేషం. థియేటర్లలో ఈ సినిమా అద్భుతంగా ఆడిపోగా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.

ఇప్పుడీ సినిమా థియేటర్ల రన్ ముగించి ఓటీటీలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. కానీ ఈ సమయంలో సినిమా గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు సుజీత్, నిర్మాతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం మొదలైంది. అయితే ఆ వార్తలకు సుజీత్ వెంటనే స్పందించారు.

తాను ఒక ఓపెన్ లెటర్ ద్వారా ఈ రూమర్స్‌కి ముగింపు పలికారు. ‘ఓజీ’ సినిమా కోసం మొత్తం టీమ్ చాలా కష్టపడి పనిచేసిందని, నిర్మాతలు తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని, సినిమాను విజయవంతంగా పూర్తి చేయడంలో అందరి సహకారం అమూల్యమని ఆయన తెలిపారు.

Related Posts

Comments

spot_img

Recent Stories