సుహాస్‌ సినిమా ఓటీటీ తేదీ ఖరారైంది!

టాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు పొందుతున్న యువ నటుడు సుహాస్ ఈ ఏడాది “ఓ భామ అయ్యో రామ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పటికీ ఆశించిన స్పందన అందుకోలేకపోయింది.

మొదట థియేటర్లలో ఆడకపోయిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటీలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఈటీవీ విన్ ప్లాట్‌ఫాం సొంతం చేసుకుంది. రేపటి నుంచి అంటే ఆగస్టు 1 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో మిస్సవడంతో చూసే అవకాశం లేకపోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే వీక్షించవచ్చు.

ఈ చిత్రానికి సంగీతాన్ని రధన్ అందించగా, హరీష్ నల్లా నిర్మాతగా వ్యవహరించారు. సుహాస్ అభిమానులకూ, లైట్ హార్ట్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి ఈ సినిమా ఓటిటీలో ఒక ఆప్షన్‌గా మారనుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories