నటుడు సుహాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హీరోగా సుహాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓ భామ అయ్యో రామ’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో సుహాస్ బిజీగా ఉన్నాడు. అయితే, ఆయన తమిళ ఇండస్ట్రీలో తొలిసారి ఓ సినిమాలో నటించబోతున్నాడు. వెర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ ప్రొడక్షన్‌లో రూపొందనున్న ‘మండాడి’ అనే సినిమాలో సుహాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
తమిళ నటుడు సూరి తో పాటు సుహాస్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని సుహాస్ లుక్‌ని రివీల్ చేస్తూ ఈ పోస్టర్ తీర్చిదిద్దారు. పక్కా మాస్ అవతారంలో సుహాస్ లుక్ అదిరిపోయింది. అయితే, ఈ సినిమా నేపథ్యంతో పూర్తిగా సముద్రంపై సాగనుంది. దీంతో ఈ సినిమాలో సుహాస్ ఓ జాలరిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక సుహాస్ మాస్ లుక్‌తో వేసుకున్న జెర్సీపై సునామీ రైడర్స్ అనే క్యాప్షన్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాలో సుహాస్ పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.