ఈ ఏర్పాటుతో మెరుగైన సేవలకు తోడ్పాటు! 

చంద్రబాబు నాయుడు ఈ దఫా ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడే ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించారు. గతంలో తాను పనిచేసిన తీరు వేరు.. ఈ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత పనిచేసిన తీరు వేరు.. అని ఆయన అప్పట్లోనే అన్నారు. ఆయన మాటలు ఇప్పుడు ఆచరణలో కూడా కనిపిస్తున్నాయి. పనితీరును రోజురోజుకు మరింత మెరుగుపరచడానికి తన చిత్తశుద్ధితో ఉన్నారని అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన తర్వాత అవినీతి మంత్రులందరి పనితీరు మీద వారికి ప్రోగ్రెస్ రిపోర్టు అందజేయనున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గతంలో ఆయనకు అలవాటు లేని కొత్త ఏర్పాటు ఇది. ఈ ఏర్పాటు ఉండడం వలన మంత్రులలో పద్ధతిగా పనిచేయడం పట్ల భయం, బాధ్యత పెరుగుతాయని.. తద్వారా ప్రభుత్వం పనితీరు కూడా మెరుగుపడుతుందని.. ప్రజల్లో మంచి పేరు వస్తుందని కూడా ప్రజలు అనుకుంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండున్నరెళ్ళ  తర్వాత క్యాబినెట్ ను సమూలంగా మారుస్తానని ప్రకటించారు. పూర్తిగా కొత్తవారికి అవకాశం ఇస్తానని అన్నారు. అయితే జగన్ ఆలోచన కేవలం ఎక్కువ మందికి పదవులు పంచడం అనే ప్రాతిపదికతో చేశారే తప్ప.. అసమర్ధులను పక్కన పెట్టే ఆలోచనతో చేసినది కాదు. పైగా అలాంటి ప్రకటన వలన అధికారంలోకి వచ్చిన ప్రతి మంత్రి కూడా రెండు నెలల తర్వాత తమ పదవి ఉండదు అనే స్పృహతో తొలిరోజు నుంచి దోచుకోవడం ప్రారంభించారు. జగన్ ఆలోచన ఆ రకంగా ప్రభుత్వం మరింత భ్రష్టు పట్టిపోవడానికి కారణమైంది. తీరా రెండున్నర ఏళ్ల పదవీకాలం గడిచిన తర్వాత క్యాబినెట్ ను సమూలంగా మార్చడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చాలలేదు. భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలామంది మంత్రులను కూడా ఆయన అనివార్యమైన పరిస్థితుల్లో తిరిగి కొనసాగించారు. కేవలం కులాల ప్రాతిపదిక, వర్గాల ప్రాతిపదిక, ముఠాల ప్రాతిపదికగా మాత్రమే ఎక్కువమందికి మంత్రి పదవి ఇచ్చాను అని చెప్పుకోవడం కోసం ఈ మార్పు చేర్పులు ఆయన వాడుకున్నారు తప్ప అందులో వారి సేవలకు విలువ ఇచ్చే ఏర్పాటు ఏమీ లేదు. 

కానీ చంద్రబాబు నాయుడు ఆలోచన చాలా బాగుంది. వంద రోజుల తర్వాత వారి ప్రోగ్రెస్ రిపోర్టును వారికే అందజేయడం అంటే.. పదవి ఉన్నది దోచుకోవడానికి కాదని ఆ పదవిలో వారు ఎలా పని చేస్తున్నారో ఒక నిఘా వ్యవస్థ గమనిస్తూ ఉంటుందని హెచ్చరించడం కింద గుర్తించాలి. ఎంతో కొంత మంత్రులు ఏవైనా పొరబాట్లు చేసి ఉంటే కూడా వాటిని దిద్దుకోవడానికి మరింత మెరుగ్గా ప్రజలకు సేవలు చేయడానికి చంద్రబాబు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ఈ ప్రోగ్రెస్ రిపోర్టు అనే ఏర్పాటు మెరుగైన ప్రభుత్వ సేవలకు తోడ్పాటు అవుతుందని ప్రజలందరూ భావిస్తున్నారు. 

జనసేన మంత్రులకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టులను మాత్రం పవన్ కళ్యాణ్ చేతికి అందిస్తానని చంద్రబాబు ప్రకటించడం కొసమెరుపు.

Related Posts

Comments

spot_img

Recent Stories