వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వరద సహాయక చర్యల మీద అదే పనిగా విషం కక్కుతున్న అరాచక శక్తులు ఎంతగా శృతి మించి వ్యవహరిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద సీరియస్ గా తీసుకోవడం లేదు. జగన్ దళాల విచ్చలవిడి పోకడలను ఆయన చూసీచూడనట్లుగా ఉపేక్షిస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వాన్నే అస్థిరత పాల్జేయాలని కుట్రలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. విజయవాడను వరద ముప్పు ముంచెత్తి 8 రోజులు గడిచినా చంద్రబాబు ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని, ఒక్కరికి కూడా సాయం అందించలేదని, వరద సహాయక చర్యల్లో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సిపి దళాలు విమర్శిస్తూ నవ్వుల పాలు అవుతున్నాయి. ఒకపై ఒకవైపు చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం చేస్తున్న సహాయక కార్యక్రమాలు లక్షల మంది ప్రజలకు అనునిత్యం స్వానుభవంలోకి వస్తూ ఉండగా వైసీపీ దళాలు చేస్తున్న విషప్రచారం హాస్యాస్పదం అవుతోంది. అందుకే ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే తాజాగా వైసిపి దళాలు సోషల్ మీడియాలో మరొక రకమైన విచ్చలవిడి ప్రచారాన్ని ప్రారంభించాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి తెలుగుదేశం పార్టీ వైదొలగబోతున్నదని సోమవారం నాడు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో దుర్మార్గమైన ప్రచారం మొదలుపెట్టారు. ఇలాంటి ప్రచారం పట్ల చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఆస్థిరపరచాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ తరహా విన్యాసాలు గతంలో ఎప్పుడూ లేవు, అడిగే వారు లేరని పేటీఎం బ్యాచ్ బరితెగించి పోస్టింగులు పెడుతోంది. ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే ఊరుకునేది లేదు.. అంటూ చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. మేమురాజీనామా చేయాలనేది మీ అభిప్రాయం అయితే మీ అభిప్రాయంగా పోస్టింగ్ పెట్టుకోండి అంటూ సూచన కూడా చేశారు!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఇలాంటి నీచమైన ప్రచారం ఆ పార్టీ నే నవ్వులపాలు చేసేలాగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తూ ఉండగా, కేంద్రంతో అద్భుతమైన సమన్వయంతో చంద్రబాబు రాష్ట్రాన్ని పురోగతి దిశగా తీసుకు వెళుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటకు వస్తుందని సాగించే ప్రచారం కేవలం కుట్ర తప్ప మరొకటి కాదని అందరూ భావిస్తున్నారు.