ప్రభాస్‌ తో ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: అనుష్క!

టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క గురించి ఎవరికీ పెద్దగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత  అన్ని భాషాల్లో  స్టార్ హీరోల సరసన నటించి తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు జోడీగా మిర్చి, బిల్లా, బాహుబలి 1, బాహుబలి 2 వంటి చిత్రాల్లో నటించి అభిమానుల గుండెల్లో స్పెషల్ గుడి కట్టించేసుకుంది.

ఈ ఇద్దరి కాంబో ఎంతో మందిని మైమరిపించింది. ఈ క్రమంలోనే వీరిద్దరు గత కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ ఈ జంట అలాంటి వార్తలపై స్పందించి స్నేహితులం అనే క్లారిటీ ఇచ్చారు. అయితే అనుష్క కొద్ది కాలం పాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి…. చాలా కాలం తరువాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం మరో రెండు మూడు చిత్రాల్లో నటిస్తుంది.

 ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ప్రభాస్ నటించిన ఓ సినిమాలో ఆమె  నటించడం వల్ల బాధపడినట్లు సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ‘‘ నేను ప్రభాస్, నమిత నటించిన బిల్లా  సినిమాలో నటించాం. అయితే ఇందులో బికినీ సీన్‌ ఒకటి ఉంది . ఆ సమయంలో నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సినిమాను ఒప్పుకోకపోయి ఉంటే కచ్చితంగా ఈ బికినీ సీన్ కోసమైనా సినిమానే వద్దు అనుకునేదాన్ని. కానీ ఈ సినిమా కోసం ముందుగానే ఒప్పుకుని బాండ్‌పై సంతకం చేయడం వల్ల చివరికి ఏమి చేయలేకపోయాను. దీంతో తప్పని పరిస్థితుల్లో బికిని ధరించవలసి వచ్చింది.

నేను ప్రభాస్‌ ఆ సినిమాలో అలా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాను’’ అంటూ వివరించింది. ప్రస్తుతం అనుష్క కామెంట్స్ వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories