రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం..చంద్రబాబు!

రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తాం..చంద్రబాబు!

ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యం గా పని చేస్తానని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. గత ఐదు సంవత్సరాల్లో జరిగిన దుష్పరిణామాల వల్ల రాష్ట్రానికి తీరని స్థాయిలో నష్టం జరిగిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్డీఏ కూటమికి అధికారం ఇచ్చారని, అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని బాగు చేస్తామని తెలిపారు.

దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి లేనన్ని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని చెప్పారు. గోదావరి నుంచే 3వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయని, ఆ నీటిని వినియోగించుకోగలిగితే అద్భుతాలు సృష్టించవచ్చని తెలిపారు. కేంద్రం నుంచి ఏపీ నేతల కోసం ఎలాంటి పదవులు ఆశించలేదని చంద్రబాబు వివరించారు. గతంలో వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు ఆశించలేదని మరోసారి బాబు గుర్తుచేశారు. 

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అప్పట్లో అంగీకరించానని చెప్పారు. ఇప్పుడూ ఎలాంటి పదవులు కోరలేదని, కానీ ఎన్డీఏ నుంచి వచ్చిన ఆఫర్‌ని మాత్రం కాదనకుండా, రెండు మంత్రి పదవులు తీసుకున్నట్లు తెలిపారు.గత ఐదేళ్ల జగన్ పాలనతో అమరావతిపైన ఉన్న ఆకర్షణ కొంత తగ్గిందన్నారు. అమరావతికి ఈ ఐదు సంవత్సరాల్లో కోల్పోయిన ప్రతిష్టను తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని, అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories