నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “డాకు మహారాజ్” ఇపుడు ఓటిటిలో అదరగొడుతుండగా ఇపుడు ఈ చిత్రం తర్వాత బాలయ్య నుంచి సాలిడ్ ప్రాజెక్ట్ గా “అఖండ 2” స్టార్ట్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే ఈ సినిమా షూటింగ్ ఒకపక్క ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. అయితే ఒక్క షూటింగ్ మాత్రమే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో కూడా చేసేస్తున్నారట. ఇలా అఖండ 2 లో ఇంటర్వెల్ ఎపిసోడ్ తాలూకా గ్రాఫిక్స్ పనులు స్టార్ట్ చేసేసారట. ఇలా షూటింగ్ సహా ఈ పనులు కూడా జెస్ట్ స్పీడ్ లో జరిగిపోతున్నాయని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.