కుబేర’కు స్టార్స్ శుభాకాంక్షలు!

టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటైన “కుబేర” ఇంకొద్ది గంటల్లో థియేటర్లలోకి గ్రాండ్ గా  అడుగుపెట్టింది. టాలెంటెడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించబడింది. కథలో థ్రిల్ ఉండబోతుందని ట్రైలర్ తోనే స్పష్టమైపోయింది.

ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నా లాంటి పాపులర్ నటులు కలిసి పనిచేయడంతో మూవీ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా నాగార్జున ధనుష్ కాంబినేషన్ తొలిసారి కనపడనున్న తరుణంలో అభిమానుల్లో ఆసక్తి అమాంతం పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా పెద్ద స్కేల్‌లో రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న వేళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు తమ అభినందనలు తెలియజేశారు. టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ వంటి వారు సోషల్ మీడియా ద్వారా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సినిమా విజయం సాధిస్తుందని వాళ్లు నమ్మకంగా చెప్పారు.

మరి ఓపెనింగ్స్ విషయంలో కూడా టీం ధైర్యంగా ఉందే తప్ప తగ్గడం లేదు. మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ వస్తుందని యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే ఆకట్టుకుంటూ, సినిమాపై హైప్ పెంచింది.

మొత్తంగా చూస్తే “కుబేర” ఒక్కసారి థియేటర్లకు వచ్చాక ఏ రేంజ్‌లో ఆడియెన్స్‌ను కనెక్ట్ చేసుకుంటుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories