పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ “ది రాజాసాబ్”పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తుండటంతో ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం మేకర్స్ సిద్ధం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత మరియు నిర్మాత కోన వెంకట్ ఇటీవల ట్రైలర్ చూసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లో, హారర్ జానర్‌లో ఇప్పటివరకు దేశంలో తీసిన సినిమాల కంటే ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని, ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభాస్ నటన మరింత హైలైట్ అవుతుందని ఆయన చెప్పడంతో ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.